Ram Gopal Varma says KCR is Pan India Political Star Unlike Yash, Tarak, Prabhas, Ram Charan, Allu Arjun: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన నుంచి సరైన హిట్ సినిమా వచ్చి చాలా కాలమైంది. అయితే ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడానికి ఆసక్తి చూపిస్తున్న వర్మ తాజాగా కేసీఆర్ ను ఫ్యాన్ ఇండియా హీరోలతో పోలుస్తూ చేసిన ట్వీట్ ఒకటి ఆసక్తికరంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ లాంటి సినిమాల అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి కూడా భారతీయ రాష్ట్ర సమితి పేరుతో పాన్ ఇండియా లెవెల్ కి వెళుతుందని ఆయన కామెంట్ చేశారు. రీల్ హీరోలలా కాకుండా కేసీఆర్ రియల్ హీరో లాగా కథన రంగంలోకి దిగుతున్నారు అంటూ అర్థం వచ్చేలా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, ప్రభాస్, ఎన్టీఆర్, యష్ లాగా రీల్ హీరోలలా కాకుండా కెసిఆర్ ఒక పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అని వర్మ చెప్పుకొచ్చారు.


అన్నట్టు రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ మీద బయోపిక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వర్మ సినిమాల విషయానికి వస్తే ఆయన చివరిగా కొండ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొండ మురళి, కొండా సురేఖ దంపతుల బయోపిక్ గా ఈ సినిమాని రూపొందించినట్లు ప్రచారం చేశారు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మాత్రం నిరాశే ఎదురైంది.


ప్రేక్షకులు ఈ సినిమాని అయితే పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి సినిమాల రీ రిలీజులు జరుగుతున్న నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తన అడవి సినిమాని మళ్లీ రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 14వ తేదీన నితిన్ హీరోగా నటించిన అడవి సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నట్లు రాంగోపాల్ వర్మ ట్వీట్  చేశారు. ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా నిషా కొఠారి నటించింది. ఈ సినిమాను నట్టి కుమార్ తో కలిసి రామ్ గోపాల్ వర్మ నిర్మించారు. 


Also Read: Dada Saheb Phalke: ఆశా పరేఖ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. ఆయనతో ప్రేమ వల్ల జీవితాంతం అవివాహితగానే!


Also Read: Tragedy at Anirudh's Home: అనిరుధ్ ఇంట తీవ్ర విషాదం.. ఏమైందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook